31 July, 2026 | 9:50 PM

నమ్ముకున్న ఇంటి పని వాడే చోరీకి పాల్పడ్డాడు

31-07-2026 08:43 PM

బోథ్,(విజయ క్రాంతి): సోనాల మండలంలోని సూర్య నగర్ గ్రామానికి చెందిన ధరావత్ వినోద్ కుమార్ ఇంటిలో ఈనెల 26న దొంగతనానికి పాల్పడ్డ ఇరువురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించడం జరిగిందని బోత్ సిఐ గురుస్వామి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు సీఐ తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. ఈనెల 26న వినోద్ కుమార్ తన తల్లిని తీసుకురావడానికి ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని పరాస్ గావ్ గ్రామానికి వెళ్లడం జరిగింది. అయితే అంతకుముందు ఇంట్లో ఉన్న వెండి బంగారు ఆభరణాలను ట్రంకు పెట్టెలో భద్రపరిచి తానం వేసి వెళ్ళాడు.

ఈ విషయాన్ని పసిగట్టిన ఇంటి పనివాడైనా అర్జున్ ఆడే తనకు పరిచయం ఉన్న రాథోడ్ గణేష్ కు తెలపడంతో అదే రోజు రాత్రి సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో రాథోడ్ గణేష్ ఇనుపరాడుతూ తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి ట్రంకు పెట్టెలో ఉన్న ఒక కిలో నాలుగు గ్రాముల వెండి ఆభరణాలు 15 గ్రాముల బంగారు ఆభరణాల తోపాటు 2000 రూపాయల నగదును అపాహించారు. అయితే దీంతో బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సాంకేతిక ఆధారాలతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితులను గుర్తించడం జరిగిందని సీఐ తెలిపారు.

కేసు నమోదైన విషయం తెలుసుకొని చోరీ సొత్తుతో పరారయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దర్నీ అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద దొంగలించిన 1.4 కేజీల వెండి ఆభరణాలు పది నగరంలో బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా 112 కు సమాచారం అందించాలని సిఐ తెలిపారు కేసులో చాకసక్యంగా వ్యవహరించిన ఎస్ఐ వి. పురుషోత్తం పోలీసు సిబ్బంది మదన్ ఆఫీస్ రాహుల్ సంతోష్లను సిఐ అభినందించారు.