31 July, 2026 | 9:46 PM

సీసీ కెమెరా గ్రామ రక్షణకు భద్రత కవచం

31-07-2026 08:38 PM

డిఎస్పి మధుసూదన్ రెడ్డి 

చౌటుప్పల్,(విజయక్రాంతి): చౌటుప్పల్ మండలంలోని చిన్న కొండూరు గ్రామంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిఎస్పి మధుసూదన్ రెడ్డి , సిఐ మన్మధకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సీసీ కెమెరాలు గ్రామానికి రెండు కళ్ళలాంటివని నేరాల నివారణకు సమర్థవంతమైన సాధనమని దొంగతనాలు, గొడవలు, ప్రమాదాలు వంటి సంఘటనపై నిరంతరం నిఘ, నేరస్తులను త్వరగా గుర్తించి చట్టపరమైన చర్యలకు తోడ్పడుతుందని, గ్రామంలో శాంతి ,భద్రత మరియు క్రమశిక్షణను బలోవితం చేస్తుంది. దర్యాప్తులో పోలీసులకు కీలమైన సాక్షాలనందిస్తుందని అన్నారు.