29 August, 2026 | 4:10 AM

‘ఆంథే- ప్రారంభించిన ఆకాష్

29-08-2026 01:11 AM

ఏఈఎస్‌ఎల్ ఎండీ, సీఈఓ చంద్రశేఖర్ గరిస రెడ్డి 

ముషీరాబాద్, ఆగస్టు 28 (విజయక్రా ంతి): విద్యార్థుల ప్రతిభను గుర్తించి, పోటీ పరీక్షలకు సన్నద్ధతను అంచనా వేసేందుకు ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏ ఈఎస్‌ఎల్) ‘ఆంథే-2026‘ ను ప్రారంభించిం ది. గత 16 ఏళ్లలో కోటి మందికి పైగా వి ద్యార్థులు నమోదు చేసుకున్న ఈ పరీక్ష దా ్వరా విద్యార్థుల సామర్థ్యం, సబ్జెక్టుల వారీగా బలాలు, మెరుగుపరుచుకోవాల్సిన అంశాల ను అంచనా వేయనున్నట్లు సంస్థ తెలిపింది.

ఆంథే-2026లో అర్హులైన విద్యార్థులకు 100 శాతం వరకు స్కాలర్షిప్లు, ప్రతిభావంతులకు రూ.2.5 కోట్ల నగదు బహుమతులు అం దించనున్నట్లు వెల్లడించింది. పరీక్ష అనంత రం విద్యార్థులకు ‘ఆంథే ఇంటెలిజెన్స్ రిపో ర్ట్’ అందించి, వారి పోటీ పరీక్షల సన్నద్ధతపై సమగ్ర అవగాహన కల్పిస్తామని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం హిమాయత్ నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  ఏఈఎస్‌ఎల్ ఎండీ, సీఈఓ చంద్రశేఖర్ గరి స రెడ్డి మాట్లాడుతూ ఆంథే కేవలం స్కా లర్షిప్ కోసం నిర్వహించే పరీక్ష కాదని, వి ద్యార్థులు తమ సామర్థ్యాన్ని అర్థం చేసుకుని సరైన దిశలో ముందుకు సాగేందుకు ఉ పయోగపడే మూల్యాంకన వేదిక అని తె లిపారు.

ఆంథే-2026 రిజిస్ట్రేషన్లు అధికారిక పోర్టల్, ఆకాష్ కేంద్రాల్లో ప్రారంభమయ్యా యని చెప్పారు. ఆన్లైన్ పరీక్షలు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 1 వరకు, ఆఫ్లైన్ పరీక్షలు అక్టోబర్ 11, 25, నవంబర్ 1 తేదీల్లో ని ర్వహించనున్నట్లు సంస్థ వెల్లడించింది. 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విదా ్యర్థులు పరీక్షకు అర్హులని పేర్కొన్నారు. ఏఈ ఎస్‌ఎల్ ప్రతినిధులు   ఆకాష్, అమిత్‌కుమా ర్, అంకిత్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.