22-06-2025 12:00:00 AM
పౌరులెవరూ గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా, తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి (ఐరాస) 1987లో యేటా జూన్ 26న ప్రపంచ ఆదేశాలు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిర్వహించాలని సూచించింది. అందుకు జూన్ 26వ తేదీనే ఐరాస ఎందుకు ఎంచుకున్నదంటే..? క్రీ.శ 1839లో చైనాలో నల్లమందు వ్యతిరేక యుద్ధం జరిగింది.
సమాజంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు అక్కడి పౌరులు మహత్తర పోరాటం చేశారు. ఇదే ఏడాది జూన్ 26న ఆ దేశ జనరల్ అసెంబ్లీ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ఆ రోజుకు ప్రతీకగా ఏటా ప్రపంచ దేశాలు డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం జరుపుకొంటాయి.