26 June, 2026 | 1:47 AM

సిద్దిపేటలో మాదకద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ

26-06-2026 12:00 AM

సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 25: మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేం దుకు గురువారం సిద్దిపేట ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ర్యాలీ, అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కె.హైమావతి, పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. డ్రగ్స్కు నో చెప్పండి ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూ రంగా ఉండి విద్య, ఉపాధి, లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలని సూచించారు. డ్రగ్స్ విక్రయాలు, వినియోగంపై సమాచారం ఉంటే అధికారులకు తెలియజేయాలని, సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో డీ అడిక్షన్ సెంటర్ అం దుబాటులో ఉందన్నారు. కమిషనర్ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. అంబేద్కర్ చౌరస్తాలో విద్యార్థులు మానవహారం ఏర్పడి డ్రగ్స్కు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు.