బాన్సువాడ టు టీటీడీ దేవస్థానానికి మహా సైకిల్ యాత్ర
జెండా ఊపి ప్రారంభించిన మాజీ డీసీసీబీ చైర్మన్
బాన్సువాడ, జూన్ 25 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నుండి సువర్ణ భూమి శబరిమల మహా పాదయాత్ర ట్రస్టు ఆధ్వర్యంలో గురు వినయ్ స్వామి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం బాన్సువాడ నుంచి ప్రారంభమైన మహా సైకిల్ యాత్రకు మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ భక్తి, నిబద్ధత, సంకల్పం కలయికగా ప్రారంభమైన ఈ యాత్ర శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో విజయపథంలో ముందుకు సాగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మాలధారణ స్వాములు, పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు తదితరులు ఉన్నారు.






