స్వర్ణకారుల సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ
సమస్యల పరిష్కారానికి కలెక్టర్కు వినతిపత్రం
కామారెడ్డి, జూన్ 25 (విజయక్రాంతి): స్వర్ణకారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూకామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం స్వర్ణకార సంఘం, కామారెడ్డి పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో స్వర్ణకారుల సమస్యల పరిష్కారం కోసం గురువారం కామారెడ్డి లో భారీ ర్యాలీ నిర్వహించారు. స్వర్ణకార సంఘం నుంచి ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకొని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
272 జీవోలో సవరణలు చేయాలని, 50 సంవత్సరాలు దాటిన స్వర్ణకారులకు నెలకు రూ.5,000 పెన్షన్ అందించాలని, అలాగే ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా స్వర్ణకారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి స్వర్ణ కాంప్లెక్స్ నుంచి ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమంలో రాష్ట్ర స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షులు మంచోళ్ల రాజమౌళి, జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు కంసాలి ప్రహ్లాద్ చారి, కోశాధికారి సిహెచ్ శశికుమార్, పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు మరికంటి పి. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బసవపురం ఎం. ప్రభాకర్, కోశాధికారి శేషు కుమార్, ఉపాధ్యక్షుడు డి.ఆర్. కేశవ్, సహాయ కార్యదర్శి చింతామణి శేఖర్, యువజన సంఘం అధ్యక్షులు ఎల్. ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏ. సంతోష్, కాచపురం చంద్రశేఖర్, వైవి రమణ, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.






