కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలి: చిలువేరు అంజయ్య
31-10-2025 11:55 PM
సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో ఎఐటియుసి 106వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏఐటియుసి మండల ప్రధాన కార్యదర్శి చిలువేరు అంజయ్య జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద కార్మికుల పక్షాన ఎఐటియుసి నిరంతరం పోరాడుతుందని తెలిపారు. కార్మికులకు వేతన గిట్టుబాటు ఏఐటియుసి కృషి వలన సాధ్యమైందన్నారు. భవన కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఎక్స్గ్రేషియా చెల్లించడం మొదటి విజయం అన్నారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ ను వెంటనే రద్దు చేయాలని కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.






