01-11-2025 12:00:00 AM
విద్యార్థులు స్వాతంత్య్ర యోధుల చరిత్ర తెలుసుకోవాలి - సీఐ రాజు వర్మ
చర్ల, అక్టోబర్ 31, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఏక్తా దివాస్ పురస్కరించుకొని శుక్రవారం ఉదయం సర్దార్ వల్లభాయ్ పటేల్ ని స్మరిస్తూ పోలీస్ శాఖ సి ఐ రాజు వర్మ ఆధ్వర్యంలో టూ కె రన్ కార్యక్రమం జరిగింది, స్థానిక పెట్రోల్ బంక్ నుండి బస్టాండ్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు టూ కే రన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ రాజు వర్మ మాట్లాడుతూ విద్యార్థులు పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని సంపాదించుకోవా లని నాడు రజాకారుల ఆగడాలను ఎండగట్టేందుకు స్వతంత్ర సమరయోధులు పోరా టాలు చేశారని విద్యార్థి దశలోనే స్వతంత్ర పోరాట యోధుల చరిత్ర తెలుసుకోవాలని అన్నారు, ఈ కార్యక్రమం లో సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వివేక్ రంజన్ మా ట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు మరువలేనివని నిత్యం రన్నింగ్ వాకింగ్ వంటివి చేస్తుండాలని అన్నారు, అనంతరం ఎస్త్స్ర కేశవ్, పి ఈ టి శ్రీనివాస్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు , ఈ కార్యక్రమంలో ఎస్ ఐ నర్సిరెడ్డి, వివిధ పాఠశాలల కళాశాలల విద్యార్థులు యువకులు తదితరులు పాల్గొన్నారు.