14 May, 2026 | 2:23 PM

అనురాగ్ ఈసీఈ విద్యార్థులకు క్యూఎన్ఎక్స్ ఈహ్యాక్ 2026 నందు జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి

14-05-2026 01:20 PM

ఘట్ కేసర్, మే 14 (విజయక్రాంతి) :  క్యూఎన్ఎక్స్ పై స్క్వేర్ టెక్నాలజీస్ సంయుక్తంగా హైదరాబాద్‌లోని క్యూ.ఎన్.ఎక్స్ కార్యాలయంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక  ఈహ్యాక్ 2026 నందు అనురాగ్ విశ్వవిద్యాలయం ఈసిఈ విభాగానికి చెందిన  అగ్నిసెన్స్ బృందం జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి సాధించింది.

డాక్టర్ రాధిక అలహరి, డాక్టర్ రఘు ఇంద్రకంటి మార్గదర్శకత్వంలోని  జి. అఖిల్, ఇ. దీప్సికరెడ్డి షేక్.సారా లతో కూడిన విద్యార్థుల బృందం క్యూఎన్ఎక్స్ బేస్డ్ మల్టీ కోర్ ఎస్ డి వి కాక్ పిట్ సేఫ్టీ అనే ప్రాజెక్ట్‌ను ప్రదర్శించింది.

దేశవ్యాప్తంగా సుమారు 250 బృందాలు నమోదు కాగా, హైదరాబాద్ స్టేట్ క్లస్టర్‌లో 33 బృందాలు పాల్గొన్నాయి. వీటిలో 10 బృందాలు జాతీయ స్థాయి ఫైనల్స్‌కు ఎంపికయ్యాయి.  అగ్నిసెన్స్ బృందం స్టేట్ లెవల్‌తో పాటు నేషనల్ లెవల్ ఫైనల్ రౌండ్‌లోనూ ప్రథమ స్థానం కైవసం చేసుకోవడంతో పాటు లక్ష రూపాయల నగదు బహుమతిని గెలుపొందారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అర్చన మంత్రి, సీఈఓ నీలిమ సూర్యదేవర, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ స్టాటర్జి అనురాగ్ పల్లా, డీన్ ఎస్ఓఈ డాక్టర్ వి. విజయ్ కుమార్, అసోసియేట్ డీన్ డాక్టర్ కె. శ్రీనివాస చలపతి, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ హరికృష్ణ కమతం ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందించారు.