11 July, 2026 | 3:22 AM

‘సర్’గడువు పొడిగించండి

11-07-2026 02:41 AM

కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్ నేతల వినతి

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) సమర్థవంతంగా, పారదర్శకంగా జరగాలంటే మరింత సమయం అవసరమని, మరో రెండు నెలలు గడువు పొడిగించాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కోరారు.

శుక్రవారం బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అయింది. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ నెమ్మదిగా జరుగుతుందని, కేవలం 5 నుంచి 10 శాతం మాత్రమే పూర్తయిందన్నారు. కొన్ని ప్రాంతా ల్లో బీఎల్‌ఓలకు సర్ కార్యక్రమంపై పూర్తిస్థాయిలో లేదని, అవసరం మేరకు ఎన్యూమరే షన్ ఫారాలు కూడా అందుబాటులో లేవన్నారు.

హైదరాబాద్‌లో ఇలాంటి సమస్యలు గుర్తించిన తర్వాత కొంతమంది అధికారులను మార్చారని, ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. బీఆర్‌ఎస్ పక్షాన రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 వేల మంది బూత్ లెవల్ అసిస్టెంట్లను నియమించామని, వారు ప్రతి బూత్‌లో ఓటర్లకు సహాయపడుతూ సవరణ ప్రక్రియలో భాగస్వాములు అవుతున్నారని వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తేనే ఈ ప్రక్రియ పారదర్శకంగా, విజయ వంతంగా సాగుతుందన్నారు.

ముఖ్యంగా ఓటర్ల వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేస్తే డూప్లికేట్ నమోదులను గుర్తించడం సులభం అవుతందని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను ప్రక్షాళన చేయాలంటే సరిహద్దు రాష్ట్రాల్లో డూప్లికేట్ ఓటర్ల సమస్యను కూడా పరిష్కరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఒకే వ్యక్తి పేరుతో రెండు చోట్ల ఓటు నమోదైన సందర్భాలు ఉన్నాయని, అలాంటి లోపాలను సర్ ప్రక్రియలో సరిదిద్దాలని పేర్కొన్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో గణనీయ సంఖ్యలో డూప్లికేట్ ఓట్లను తమ పార్టీ గుర్తించిందని, ఎన్నికల సంఘానికి నివేదిక రూపంలో అందజేశామని వెల్లడించారు.