11 July, 2026 | 3:22 AM

గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

11-07-2026 02:38 AM

యువతి మృతి

శేరిలింగంపల్లి, జూలై 10 (విజయక్రాంతి): గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద భారీ వాహనాల నిర్ల క్ష్యం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువతి స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది. మరొక మహిళ తీవ్రంగా గాయ పడింది. పోలీసు సమాచారం ప్రకారం, ట్రీబుల్ ఐటీ నుంచి అంజయ్య నగర్ వైపు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది.

ఈ ఘటనలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎంప్లాయ్ మల్లం భవాని (23) అనే యు వతి అక్కడికక్కడే మృతి చెందగా, ఎస్. సుభాషిణి (30) తీవ్ర గాయాలపాలైంది. గాయపడిన సుభాషిణిని హుటా హుటిన హిమగిరి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

భవాని మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని బాధితులు ఆరోపించారు. పోలీసు లు ట్యాంకర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో ట్యాంకర్ అధిక వేగంలో వెళ్తూ ఆటోను వెనుక నుంచి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఫ్లైఓవ్ప ట్రాఫిక్ నియమాల అమలు, వాహనాల వేగ నియంత్రణపై అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.