వరి నారుమళ్లు పరిశీలించిన ఏవో
25-06-2026 04:10 PM
నాగిరెడ్డిపేట్,జూన్ 25 (విజయక్రాంతి): మండలంలోని తాండూరు గ్రామంలో వానాకాలంకు వరి పంటల కోసం సాగు చేసిన నారుమళ్ళను మండల ఏవో సాయికిరణ్ సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఏవో సాయికిరణ్ మాట్లాడుతూ...ఉష్ణోగ్రత ఏక్కువగా ఉండి,రాత్రి పగలు ఉష్ణోగ్రతలో వ్యత్యాసం ఉండడం వల్ల నారుమళ్ళ ఎర్రబడడం జరుగుతుందని తెలిపారు.దానిని గమనించినట్లయితే ఎన్:పి: కె (19:19:19) లీటర్ల నీటిని 5 గ్రాములు చొప్పున పిచికారి చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఫార్మల4(సూక్ష్మ పోషకాలు) లీటర్ నీటికి ఐదు గ్రాముల చొప్పున వారంలో రెండు సార్లు పిచికారి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏవో సాయికిరణ్,టీ.ర్.కే.వీ సైంటిస్ట్ రేవంత్,రైతులు ఉన్నారు






