25 June, 2026 | 5:26 PM

మాల్తుమ్మెద గ్రామ పాలకవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరిక

25-06-2026 04:43 PM

నాగిరెడ్డిపేట్,జూన్ 25 (విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు తలారి శోభ,బైండ్ల శ్రీనివాస్,కుడికాల రాజు, జోగులక్ష్మి,పుప్పాల శివరాములు,బోయిని పవిత్ర, సిద్ధిరాములు స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పాలకవర్గం సభ్యులను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన పాలకవర్గం సభ్యులు మాట్లాడుతూ... గ్రామ అభివృద్ధి తమ చేరుకు ప్రధాన కారణమనన్నారు.

స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నాయకత్వంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుండగా, మాల్తుమ్మెద గ్రామం కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని పేర్కొన్నారు.మాల్తుమ్మెద గ్రామంలో సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, ఇందిరమ్మ ఇండ్లు,కొత్త రేషన్ కార్డులు,గృహ జ్యోతి పథకం, వంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుతాయని తెలిపారు.గ్రామ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని సంకల్పంతో తాము సమిష్టిగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ...ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను ఉన్నంతకాలం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ ఆగదన్నారు.ప్రతి గ్రామానికి అభివృద్ధి,ప్రతి ఇంటికి సంక్షేమం అందించడమే తన లక్ష్యం ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరింత వేగవంతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు.గ్రామ అభివృద్ధి లక్ష్యంగా,ప్రజా సంక్షేమ దేహంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణకు ఈ చేరికలు నిదర్శనంగా నిలుస్తాయన్నారు.ఈ కార్యక్రమంలో చినూర్ గ్రామ సర్పంచ్ మురళి గౌడ్, గోపాల్పేట్ ఉపసర్పంచ్ గులాబ్ హుస్సేన్,ఎల్లారెడ్డి ఏఎంసీ డైరెక్టర్ ఆరిఫ్ ఉన్నారు.