13 July, 2026 | 9:48 PM

Breaking News

నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •  

గణేశ్ నిమజ్జనంలో అపశృతి

23-09-2024 12:25 AM

నీటి గుంతలో పడి వ్యక్తి మృతి

ఆదిలాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి):  గణేశ్ నిమజ్జన వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం వర్తమాన్నూర్ గ్రామానికి చెందిన రాకేశ్ (20) శనివారం రాత్రి నిర్వహించిన గణేశ్ నిమజ్జనోత్సవంలో పాల్గొన్నాడు. సమీపంలోని పిప్రి గ్రామ శివారులో ఉన్న స్టోన్ క్రషర్ వద్ద బండరాళ్ల కోసం తవిన గుంతలో పడి గల్లంతయ్యాడు. ఆదివారం పోలీసులు గజఈత గాళ్ల సాయంతో గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.