15-10-2025 06:58:13 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఉత్సవాలు, ప్రపంచ విద్యార్థుల దినోత్సవ సంబరాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా వి. నరేందర్ రెడ్డి హాజరై అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నేటి యువత అబ్దుల్ కలాంని స్ఫూర్తిగా తీసుకోవాలని, వారి నిర్దేశించినటువంటి మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించినట్లయితే వారు ఎంచుకున్న రంగంలో విజేతలు అవుతారని తెలిపారు. 11వ రాష్ట్రపతిగా, ఇస్రో శాస్త్రవేత్తగా పేరుగాంచిన వారు భారత దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని సాధించారని, అనేక ప్రతిష్టాత్మక అవార్డులను పొందాలని పూర్తిచేస్తూ తన జీవితాన్ని విద్యార్థులకు అంకితమిచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.