15-10-2025 06:55:40 PM
రాష్ట్ర రైతు సంఘం మహిళా కన్వీనర్ కందాల ప్రమీల..
నకిరేకల్ (విజయక్రాంతి): అధిక వర్షాలతో నష్టపోయిన రైతులందరికీ పంట నష్టం చెల్లించాలి. తడిసిన ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర చెల్లించి ప్రతి గింజను కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ కందాల ప్రమీల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కేతేపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతు సంఘం ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షానికి తడిసినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యానికి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు సరిపడ టార్పల్లిన్ లు అందుబాటులో ఉంచాలని కోరారు అధికారుల చేత పంట నష్టాన్ని అంచనా వేయించి పత్తి, వరిపండించి నష్టపోయిన రైతులకి ఎకరానికి 50వేల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు మండల కార్యదర్శి చింతపల్లి లూర్తుమరయ్య రైతు సంఘం నాయకులు కోట లింగయ్య సిపిఎం మండల నాయకులు లకపాక రాజు రైతు సంఘం మండల కార్యదర్శి చెరుకు సత్తయ్య, చౌగొని నాగయ్య కూకుట్ల శోభన్ వంగూరి వెంకన్న పాల్గొన్నారు.