3 April, 2026 | 4:13 AM

నీట్‌లో ‘అపొలో’ ప్రభంజనం

17-06-2025 01:01 AM

అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 16 (విజయక్రాంతి): నీట్ ఫలితాల్లో దిల్‌సుఖ్‌నగర్ అపోలో మెడికల్ అకాడమీ ప్రభంజనం సృ ష్టించి, అత్యుత్తమ ర్యాంకులు సాధించిందని అకాడమీ చైర్మన్ పోసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అకాడమీలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సోమవారం ఆయ న అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..

తమ అకాడమీ నుండి 600 మంది నీట్ రాయగా 412 విద్యార్థులు మెడికల్ సీట్లతో పాటు, 720 మార్కులకు గాను 658 మార్కులు సాధించినట్లు తెలిపారు. విద్యా విధానంలో మార్పులకు అనుగుణంగా అనుభవజ్ఞులైన అధ్యాపక బృం దంతో బోధించడం వల్లనే అత్యుత్తమ ఫలితాలు రాబట్టగలిగామన్నారు. ఈ కార్యక్ర మంలో ప్రిన్సిపాల్ అల్వాల మధుసూదన్, అధ్యాపకులు శ్రీధర్, గోవర్ధన్‌రెడ్డి, కెవిఆర్, రాజు, సునీల్ పాల్గొన్నారు.