3 April, 2026 | 5:58 AM

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి హైకోర్టులో చుక్కె దురు

17-06-2025 01:00 AM
  1. తనపై నమోదైన కేసు కొట్టివేయాలని ఎమ్మెల్యే పిటిషన్
  2. ఇరువైపులా వాదనలు విని పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం

హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): వ్యాపారి నుంచి డబ్బులు డి మాండ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఇరువైపులా వాద నలు విని ఎమ్మెల్యే పిటిషన్‌ను కొట్టివేసింది. మనోజ్ అనే గ్రానైట్ వ్యాపారి హనుమకొండ జిల్లా కమలాపురం మం డలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్నాడు.

రూ.50 లక్షలు ఇవ్వకపోతే వ్యాపా రం కొనసాగనివ్వనని, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తమను బెదిరించాడని వ్యాపారి భా ర్య ఉమాదేవి గతంలో సుబేదారి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆ మె ఫిర్యాదుతో ఎమ్మె ల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసును సవా ల్ చేస్తూ ఎమ్మెల్యే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఎమ్మెల్యే పిటిషన్‌ను కొట్టివేసింది.