calender_icon.png 20 January, 2026 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

16న విచారణకు హాజరుకావాలి

25-09-2024 12:36:38 AM

ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశం 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): ఓటుకు నోటు కేసులో అక్టోబర్ ౧6న నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది. ఈ విచారణకు సీఎం రేవంత్‌రెడ్డితో సహా మిగిలిన నిందితులందరూ హజరుకావాలని నాంపల్లి కోర్టు మంగళవారం ఆదేశించింది.

మంగళవారం ఈ విచారణకు మత్తయ్య మినహా ఈ కేసులో ఏఛొ1 నిందితుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఉదయ సింహా, వేం కృష్ణకీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ గైర్హాజరయ్యారు. వీరి గైర్హాజరుపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది.

అయితే మంగళవారం జరిగిన విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని నిందితుల తరఫు నుంచి వచ్చిన అభ్యర్థనను అంగీకరించిన కోర్టు అక్టోబర్ 16న జరిగే విచారణకు తప్పక హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డితో సహా నిందితులందరికీ ఆదేశాలు జారీచేసింది.