15 March, 2026 | 9:18 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

15-03-2026 06:33 PM

హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ టీటీడీ కల్యాణ మండపంలో విస్డం చారిటబుల్ ట్రస్ట్, భగల్ మీడియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవ వేడుకలకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సతీమణి నీలిమారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై  వేడుకలను ప్రారంభించారు. అనంతరం నీలిమ రెడ్డి మాట్లాడుతూ మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని, మహిళా శక్తి చాలా గొప్పదని, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారన్నారు.

తల్లిగా,చెల్లిగా, భార్యగా, కూతురుగా మహిళలు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ, కుటుంబ సంరక్షణలో పాలుపంచుకుంటున్నారన్నారు. అనంతరం డైనమిక్ లేడీ అవార్డ్స్-2026 పేరిట వివిధ రంగాలలో నిష్ణాతులైన మహిళలకు షీల్డ్లు, మెమొంటోలతో బహుమతి ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్  మేఘన, రిటైర్డ్ ఎమ్మార్వో పాలకుర్తి విజయలక్ష్మి, ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ రజిత ఒజ్జల, నిర్వాహకులు నాగరాజు,స్వాతి, పద్మావతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.