calender_icon.png 6 February, 2026 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రిడిటేషన్ కార్డుల జారీ కొరకు దరఖాస్తుల స్వీకరణ

06-02-2026 05:39:23 PM

జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, కలెక్టర్  కె.హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కార్డుల జారీ కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, కలెక్టర్  కె.హరిత ఒక ప్రకటనలో తెలిపారు. సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో వెబ్ సైట్ అక్రిడిటేషన్ మాడ్యూల్ ప్రారంభించడం జరిగిందని, 2026-28 సంవత్సరానికి గాను అక్రిడిటేషన్ కార్డుల జారీ కొరకు ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.

ప్రస్తుతం కొనసాగుతున్న అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈ నెల 28వ తేదీతో ముగియనుందని, అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు నూతన అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. మీడియా యాజమాన్యాలు జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డుల కొరకు తమ ప్రతినిధుల పేర్లను జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయానికి పంపించాలని, అట్టి జాబితాలో ఉన్న అభ్యర్థులు https://ipr.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను ఈ నెల 9వ తేదీ నుండి సమర్పించాలని తెలిపారు.