17 April, 2026 | 4:43 PM

ఎప్‌సెట్‌కు 3.06 లక్షల దరఖాస్తులు

25-04-2025 02:09 AM

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ఎప్‌సెట్‌కు 3,06,796 దరఖాస్తులు వచ్చినట్టు ఎప్‌సెట్ కన్వీనర్ డాక్టర్ బీ డీన్ కుమార్ తెలిపారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కు 2,20,049 దరఖాస్తులు, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లకు 86,493, రెండింటికి కలిపి 254 దరఖాస్తులు అందినట్టు గురువారం ఒక ప్రకట నలో తెలిపారు.