ప్రజావాణికి 12 దరఖాస్తులు
24-08-2026 07:48 PM
దేవరకద్ర ఎంపీడీవో శ్రీనివాసరావు
దేవరకద్ర: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 12 దరఖాస్తులు అందాయి అని ఎంపీడీవో శ్రీనివాసరావు అన్నారు. వివిధ సమస్యలపై ప్రజలు అధికారులను కలిసి తమ సమస్యలను విన్నవించారు. దరఖాస్తులను స్వీకరించిన అధికారులు సమస్యలను పరిశీలించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు ప్రజావాణి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ హర్షద్ అలీ తదితరులు పాల్గొన్నారు.






