calender_icon.png 31 July, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణికి 295 దరఖాస్తులు

12-10-2024 02:04:19 AM

హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): మహా త్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వ హించిన ప్రజావాణికి 295 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గృహ నిర్మాణశాఖకు 90, మైనార్టీ సంక్షేమం 32, విద్యుత్ 18, హోంశాఖ 10, ఇతర శాఖలకు సంబంధించినవి 145 అప్లికేషన్లు అందినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.