18 August, 2026 | 4:37 AM

కొత్త పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

18-08-2026 01:32 AM

31లోపు మున్సిపల్ ఆఫీస్‌లో దరఖాస్తు చేసుకోవాలి

మొయినాబాద్ ఆగస్టు 18(విజయ క్రాం తి): చేయూత సామాజిక భద్రతా పింఛన్ల పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు అ ర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ తెలిపారు. తొలి దశలో ఒంటరి మహిళలు, వి తంతువులు, దివ్యాంగులు, టాడీ ట్యాపర్లు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, త లసీమియా, సికిల్ సెల్ డిసీజ్, హీమోఫీలి యా వంటి రక్త సం బంధిత వ్యాధులతో బాధపడుతున్న అ ర్హులు దరఖాస్తు చే సుకోవచ్చని పేర్కొన్నారు. గతంలో ద రఖాస్తు చేయని వా రు, లేదా అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించని అర్హులు సంబంధిత పత్రాలతో ము న్సిపల్ కార్యాలయంలో దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 31, 2026 అని కమిషనర్ వెల్లడించారు.