18 August, 2026 | 3:52 AM

వైభవంగా నాగుల పంచమి

18-08-2026 01:33 AM

ఘట్‌కేసర్, ఆగస్టు 17 (విజయక్రాంతి):  ఘట్ కేసర్ సర్కిల్ ప్రాంతంలో సోమవారం నాగుల పంచమిని మహిళలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. మహిళలు ఉదయం నుంచే నాగదేవత ఆలయాల వద్దకు వెళ్లి పూజలు నిర్వహించారు. పుట్టలలో పాలు పోసి నైవేధ్యంను సమర్పించుకొని మొక్కు లు తీర్చుకున్నారు. వివిధ దేవాలయాలలో ఉన్న పాముల పుట్టల వద్ద, ఆలయాలలోని నాగదేవత విగ్రహాల వద్ద కూడ మహిళలు పూజలు నిర్వహించారు.

కుటుంబ సమేతం గా మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకోవడం తో ఆలయ ప్రాంగణాలు మహిళా భక్తులతో కిటకిటలాడాయి. తమ గ్రామాలను, కుటుం బ సభ్యులను కాపాడాలని నాగదేవతను తాము కోరుకున్నట్లు తెలిపారు. నాగులపంచమి సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో ప్రధాన రోడ్లపై కనిపించారు.