3 August, 2026 | 6:44 PM

TGCGTA రాష్ట్ర అధ్యక్షుడిగా కడారు సురేందర్ రెడ్డి

03-08-2026 05:44 PM

ముకరంపుర,(విజయక్రాంతి): శ్రీ రాజ రాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల కరీంనగర్ లో TGCGTA రాష్ట్ర అధ్యక్షులుగా డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి  ఏకగ్రీవంగా ఎన్నికైనందున అభినందన‌ సమావేశం TGCGTA యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి ని  సన్మానించారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కలువకుంట రామకృష్ణ మాట్లాడుతూ... తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఏకగ్రీవంగా ఎన్నికవడం  అది  కేవలం సురేందర్ రెడ్డి వల్లనే సాధ్యం అని అభినందించారు.

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యఐక్య కార్యాచరణ సమితి అదనపు కార్యదర్శి ఏ.నాగరాజు మాట్లాడుతూ... ఎంతో ఘనచరిత్ర కల్గిన ఎస్సారార్ కళాశాల అధ్యాపకులు రాష్ట్ర నాయకుడు కావడం సంతోష దాయక మన్నారు. ఈ కళాశాల పూర్వ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షులు కావడం కళాశాల కు గర్వ కారణమని  స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ మల్లారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సన్మాన గ్రహీత సురేందర్ రెడ్డి మాట్లాడుతూ... 2013 లో ప్రశ్నించడంతో మొదలైన ప్రస్థానం ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులు గా మారిన వైనం వివరించి తనను ఎన్నుకున్న తెలంగాణరాష్ట్ర టిజిసిజిటిఏ ప్రాథమిక సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.