4 August, 2026 | 8:49 PM

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: టీయూసీఐ

03-08-2026 05:41 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఆగస్టు 10 నుంచి చేపట్టనున్న నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) ఆధ్వర్యంలో సోమవారం ఇల్లెందులో మున్సిపల్ కార్మికులు నిరసన బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి షేక్ యాకూబ్ షావలి, ఏరియా అధ్యక్షుడు పాయం వెంకన్న మాట్లాడుతూ పారిశుద్ధ్య, వాటర్ సప్లై, ట్రాక్టర్ డ్రైవర్లు, టాటా మ్యాజిక్ హెల్పర్లు, కార్యాలయ నిర్వహణ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, అధికారులు తక్షణమే చొరవ చూపాలని డిమాండ్ చేశారు.