15 April, 2026 | 1:53 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •  

మైనార్టీల నుంచి దరఖాస్తులు ఆహ్వానం

20-02-2026 02:00 AM

మేడ్చల్, ఫిబ్రవరి 19 (విజయ క్రాంతి): తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం, మైనారిటీ సంక్షేమ శాఖ మేడ్చల్ - మల్కాజిగిరిజిల్లా ఆధ్వర్యంలో  మైనారిటీ యువత ( ముస్లిములు, క్రిసియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధులు )కు క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ లలో శిక్షణ ఇవ్వనున్నట్టు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ కాంతమ్మ తెలిపారు. ఈ శిక్షణను జిల్లాలోని మైనార్టీ యువత ఉపయోగించుకొని వివిధ ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఉపాధి సంబంధిత సమాచారం పొందవచ్చునన్నారు. 

ఆసక్తిగల అభ్యర్థులు విద్యా అర్హత పత్రాలతో సంబంధిత కార్యాలయంలో గానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో గానీ, ఈ నెల 20 నుంచి 27 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. లేదా జిల్లా మైనారటీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయాన్నీ లేదా ఫోన్ నెం:  9849204476/9000168256, 7569391754, 9000641911 కు సంప్రదించ వలసినదిగా ఆమె సూచించారు. అభ్యర్థులు పదో తరగతి లేదా ఇంటర్, ఆదాయ ద్రువీకరణ పత్రం రూ.2 లక్షలు వరకు, జిల్లా వాస్తవ్యులు మాత్రమే ధరఖాస్తు చేసుకోవాలన్నారు.