15 April, 2026 | 12:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నేర ఛేదనలో నూతన శక్తి కొత్త ట్రాకర్ శునకం

20-02-2026 02:00 AM

ఎస్పీ.సునిత రెడ్డి

వనపర్తి టౌన్ ఫిబ్రవరి 19:వనపర్తి జిల్లా పోలీసు విభాగానికి భద్రతా పరంగా మరింత బలాన్ని చేకూర్చే దిశగా, దొంగతనాలు, హత్య కేసుల విచారణలో కీలక ఆధారాలను వెలికితీయగల ట్రాకర్ శునకం మాయనూతనంగా వనపర్తి పోలీసులో చేరినట్లు జిల్లా ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు.8 నెలలపాటు ప్రత్యేక మరియు కఠిన శిక్షణను పూర్తి చేసుకున్న డాగ్ హాండ్లర్ కానిస్టేబుల్ దేవ్యానాయక్, గురువారం రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.

హైదరాబాద్ సమీపంలోని పోలీస్ డాగ్ ట్రైనింగ్ సెంటర్, నిర్వహించిన శిక్షణలో ట్రాకర్ శునకంమాయ ప్రదర్శించిన సామర్థ్యాలు, ఫీల్డ్లో దాని పనితీరు తదితర అంశాలను ఎస్పీ కి వివరించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలో జరిగే దొంగతనాలు, హత్య కేసుల దర్యాప్తులో ట్రాకర్ శునకం ‘మాయ ‘ కీలక పాత్ర పోషిస్తుందని ఆధారాలను పసిగట్టే నిశ్శబ్ద యోధులే ఈ ట్రాకర్ శునకంఅని ఎస్పీ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు,ఎస్పీ, వీరారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్, అప్పలనాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.