15 April, 2026 | 1:55 PM

Breaking News

పేకాట ఆడుతున్నారనే నెపంతో ఎస్ఐ దాడి... పోలీస్ స్టేషన్ ఎదుట 100 మంది ధర్నా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •  

పట్టణ ప్రజల అభివృద్ధికి తోడ్పడాలి

20-02-2026 02:02 AM

ఎమ్మెల్యే విజయుడు 

అలంపూర్, ఫిబ్రవరి 19:అలంపూర్ పట్టణ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం తోడ్పడాలనిఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఈ మేరకు గురువారం అలంపూర్ మున్సిపల్ చైర్మన్ గా పిండి జయరాములు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పాలకవర్గంలో ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా పాలన సజావుగా కొనసాగేలా అందరి సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా చైర్మన్ కు సూచించారు. ముందుగా చైర్మన్ పిండి జయరాములు పూజ అనంతరం బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలంపూర్ పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని ఆ దిశగా కొనసాగుతానని తెలిపారు. అనంతరం నాయకులు ఎమ్మెల్యేను చైర్మన్ ను శాలువా కప్పిపూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ విక్రమ్ కౌన్సిలర్లు అసిఫ్ ఖాన్, మోహన్ రెడ్డి, మాధురి , కమిషనర్ శంకర్, టిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.