దేవరకద్ర ప్రజావాణికి 7 దరఖాస్తులు
దేవరకద్ర, ఆగస్టు 17 : మండల కేంద్రం లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కా ర్యక్రమానికి మొత్తం 7 దరఖాస్తులు వచ్చిన ట్లు ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపా రు. వివిధ సమస్యలపై ప్రజలు ప్రజావాణిలో త మ ఫిర్యాదులను అధికారులకు సమర్పించా రు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 4 దరఖాస్తులు, పంచాయతీరాజ్ శాఖకు 2 దరఖాస్తులు, మున్సిపల్ శాఖకు సంబంధి ంచి 1 దరఖాస్తు వచ్చినట్లు ఎంపీడీవో వెల్లడించారు.ప్రజల నుంచి వచ్చిన దరఖా స్తులను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు పంపించి సమస్యలను పరిష్కరిం చేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమం ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎంపీడీవో శ్రీనివాసరావు సూచించారు.
ఇటిక్యాలలో 5 దరఖాస్తులు
ఇటిక్యాల, ఆగస్టు 17: మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావా ణి కార్యక్రమం నిర్వహించారు. వివిధ గ్రా మాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 5 దరఖాస్తులు స్వీకరించారు. వీటిలో రె వెన్యూ శాఖకు 2, పంచాయతీరాజ్, ఆర్‌అం డ్బీ, విద్యుత్ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున ఉ న్నాయి. అర్జీలను త్వరితగతిన పరిశీలించి స మస్యలను పరిష్కరించాలని ఎంపీడీవో ర మాదేవి సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెంది న 16 మంది అధికారులు పాల్గొన్నారు.
మండల స్థాయిలో..
మల్దకల్, ఆగస్టు 17: మల్దకల్ మండలంలో 21 ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజలకు ఒకే వేదికపై అందుబాటులో ఉంటారు. భూ సమస్యలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, తాగునీరు, విద్యుత్ తదితర సమస్యలపై ప్రజలు నేరుగా అర్జీలు సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. ప్రతి దరఖాస్తును నమోదు చేసి, పరిష్కారం వరకు పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.






