జాతీయ జెండాను ఆవమానించింది ఆర్‌ఎస్‌ఎస్సే..
ప్రభుత్వ సలహాదారు వీహెచ్
హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి) : దేశంలో జాతీయ జెండాను అవమానించింది ఆర్‌ఎస్‌ఎస్ అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో జాతీయజెండాను ఎగురవేయలేదని ఆయన తెలిపారు. సోమవారం ఆయన గాంధీభవన్‌ల పార్టీ సీనియర్ నేత ఆర్. లక్ష్మణ్‌యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. వందేమాతరం గేయాన్ని ఎప్పటి నుంచో పాడుకుంటున్నామని, ఇప్పుడు బీజేపీనే కొత్తగా సృష్టించినట్లుగా చేస్తోందని మండిపడ్డారు.
సోనియాగాంధీ దేశభక్తిని శంకించడం దుర్మార్గమన్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు కుర్చీ వేయమని సోనియాగాంధీ సూచించారని ఆయన తెలిపారు. అయితే సోనియా చేసిన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తోందని వీహెచ్ దుయ్యబట్టారు. బీజేపీకి నిత్యం కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచనే ఉంటుందని దుయ్యబట్టారు.






