18 August, 2026 | 3:01 AM

ప్రజావాణిలో 26 దరఖాస్తులు స్వీకరణ

18-08-2026 12:07 AM

వెంకటాపూర్, ఆగస్టు 17 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 26 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎంపిడిఓ రాజు తెలిపారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను స్వీకరించి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎంపీడీఓ రాజు మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.  దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

రెవెన్యూ సమస్యలకు సంబంధించి 19 దరఖాస్తులు, పెన్షన్లకు 3, ఇందిరమ్మ ఇళ్లకు 1, విద్యుత్తు సమస్యకు 1, మిషన్ భగీరథకు 1, ఇరిగేషన్కు 1 చొప్పున దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గిరిబాబు, ఎంఈఓ ప్రభాకర్, ఏపీఓ రాజు, వెటర్నరీ వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఇరిగేషన్, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ ఏఈలు, వ్యవసాయ అధికారి, అంగన్వాడీ సూపర్వైజర్లు, ఎంపీఓతో పాటు ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.