22 June, 2026 | 8:18 PM

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

22-06-2026 07:36 PM

ఆలేరు,(విజయక్రాంతి): భువనగిరి  కలెక్టర్ ఛాంబర్ లో సోమవారం రోజు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజావాణి దరఖాస్తులను ప్రజల నుండి  స్వీకరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు,రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 94 అర్జీలను స్వీకరించారు. అందులో రెవిన్యూ శాఖ 63, జిల్లా గ్రామీణభివృద్ధి 8, మున్సిపాలిటీ 6, సర్వే ల్యాండ్ 6, జిల్లా పరిషత్ 2, ఈఈ ఆర్ అండ్ బి 2, విద్యా 2, ఏ డి మైన్స్,సంక్షేమ శాఖ, సోషల్ వెల్ఫేర్, ఎక్సజ్, ప్రణాళికా శాఖలకు ఒక్కటి  చొప్పున వచ్చాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కల్పనా,జడ్పీ సీఈవో శోభారాణి , వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.