22 June, 2026 | 8:43 PM

పెన్షనర్ ల సమస్యను పరిష్కరించండి

22-06-2026 07:59 PM

బోథ్,(విజయక్రాంతి): పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు వినతి పత్రం అందడం జరిగింది. ఈ హెచ్ ఎస్ పథకంలో భాగంగా నగదు వైద్య చికిత్స కోసం కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులను తీసుకురావాలని అందుకు ఉత్తర్వులు ఇవ్వాలని వినతిపత్రంలో పేర్కొన్నారు పెండింగ్లో ఉన్న ఐదు విడుదల కరువు బత్యం విడుదల చేయాలని పి.ఆర్.సి నివేదికమలు చేయాలని కోరారు వీటితో పాటు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ప్రజావాణి కార్యక్రమంలో అందించడం జరిగింది కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎస్ సుధాకర్ ఆర్థిక కార్యదర్శి ఎం రాజేశ్వర్ రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు ఆరు గణపతి కిషోర్ జి శంకర్ లు ఉన్నారు