22 June, 2026 | 8:40 PM

ప్రైమరీ టీచర్ల భర్తీలలో జిల్లా వ్యాప్తంగా ఒకే విధానం కొనసాగాలి

22-06-2026 07:53 PM

- టీఆర్ఎల్డీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు సోమగాని నరేందర్ గౌడ్

హుజూర్ నగర్,(విజయక్రాంతి): ప్రీ ప్రైమరీ టీచర్లు ఆయాల నియమకాలలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని టిఆర్ఎల్ డి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు సోమగాని నరేందర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని టిఆర్ఎల్ డి జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలోమాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఫ్రీ ప్రైమరీ టీచర్, ఆయాల నియామక విధానంలో జిల్లాకు ఒక్కొక్క విధానంగా జిల్లా అధికారులు వ్యవహరించడం వల్ల దరఖాస్తు చేసిన అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ నిబంధన ప్రకారం రెండు సంవత్సరాల ప్రీ ప్రైమరీ, టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి మాత్రమే మెరిట్ జాబితాలో చోటు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎల్ డి నాయకులు, పాల్గొన్నారు.