22 June, 2026 | 9:09 PM

బెల్లంపల్లి ఆసుపత్రి ఎదుట..

22-06-2026 08:04 PM

ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి ప్రభుత్వ 100 పడకల ఏరియా ఆసుపత్రి లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు, NHM,శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి 7వ రోజు నిరసన తెలపారు. బెల్లంపల్లి ఏరియాస్పత్రి ఎదుట కార్మికులు ఆందోళన చేశారు. రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఔట్సోర్సింగ్ స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేరుగా జీతాలు చెల్లించాలనీ డిమాండ్ చేశారు. 3 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే  విడుదల చెయ్యాలని, క్యాడర్ ప్రకారంగా జీతాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  TMHOCETU స్టేట్ జాయింట్ సెక్రటరీ ఓం నారాయణ,కిరణ్,వర,శేఖర్,విజయ,పార్వతి,మల్లేశ్వరి, సాయి కృష్ణ, లక్ష్మణ్ ఉద్యోగులు పాల్గొన్నారు.