ప్రభుత్వ విప్ విజయరమణ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్, బీజేపీ నాయకులు..
22-06-2026 08:01 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల 13,14,15 వార్డులకు చెందిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన చొప్పరి శ్రీను (ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు), ఉస్తం లక్ష్మినారాయణ, కంకణల సతీష్ (ముదిరాజ్ సంఘం కార్యదర్శి), కంకణాల శ్రీనివాస్, కలవేణి శంకర్, కంకణాల రాకేష్, బొజ్జ రాజు, బండి రాజు కుమార్, చొప్పరి సంతు, సాయి తో పాటు 25 మంది బిఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో సోమవారం చేరారు. పార్టీలో చేరిన వారికి ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పద్మ అబ్బయ్య గౌడ్, సిద్ద తిరుపతి, గదాసు మంజూల రవి తదితరులు పాల్గొన్నారు.






