19-01-2026 05:14:17 PM
కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం లో 75 అర్జీలను స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీలను అర్జీదారుల నుండి స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు ఇస్తూ తక్షణమే స్పందించి పరిష్కరించాలని తెలిపారు. ప్రజావాణి లో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమొహాన్ సబ్ కలెక్టర్ కిరణ్మయి, RDO వీణ, ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.