20 May, 2026 | 3:55 PM

Breaking News

మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన నాయకులు   •   ఉత్పత్తి లక్ష్యాల సాధనే ధ్యేయంగా పునరంకితమవ్వాలి   •   సింగరేణిని కాపాడుకోవడమే తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య ఏకైక లక్ష్యం   •   మైనర్ బాలికను మభ్యపెట్టి వివాహం చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్   •   నవోదయ ఫలితాల్లో బ్లూమింగ్ మైండ్స్ విద్యార్థుల ప్రతిభ   •   ఆన్‌లైన్ మందుల అమ్మకాలను నిలిపివేయాలి   •   మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంత్రి కిషన్ రెడ్డి భేటీ.. పట్టణాభివృద్ధిపై చర్చ   •   సుప్రీంకోర్టు సీరియస్.. కులగణ పిటిషన్‌ కొట్టివేత   •   దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణాలు బంద్   •   కొనసాగుతున్న ఎల్లయ్య చెరువు కాలువల పూడికతీతల పనులు   •  

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి రుణపడి ఉంటాం

19-01-2026 05:11 PM

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు హనుమకొండ 60వ డివిజన్ వడ్డేపల్లిలో సోమవారం మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు, డివిజన్ అధ్యక్షులు ఎనుకొంటి పున్నంచందర్ ల ఆధ్వర్యంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులు గూటం రేవతి సురేందర్ రెడ్డి లకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో గూడులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి దశలవారీగా 5 లక్షల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో వెయ్యడం వల్లనే  మేము సొంత ఇంటికల నెరవేర్చుకున్నామని అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి లకి రుణపడి ఉంటామని కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.