13 March, 2026 | 11:38 PM

కస్తూర్బా పాఠశాలలో వైద్య శిబిరం

13-03-2026 09:14 PM

విద్యార్థులు భయాందోళనలకు గురి కావద్దు 

గరిడేపల్లి,(విజయక్రాంతి): 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గరిడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆర్‌బీఎస్‌కే టీం ఆధ్వర్యంలో గరిడేపల్లి కస్తూర్బా పాఠశాలలో శుక్రవారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ మాట్లాడుతూ... విద్యార్థినులకు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించామని తెలిపారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థినులకు 14416 హెల్ప్‌లైన్ గురించి అవగాహన కల్పించి, పరీక్షలకు భయపడకుండా ధైర్యంగా రాయాలని సూచించారు. ఎవరికైనా భయం లేదా ఆందోళన కలిగితే 14416కు కాల్ చేయాలని తెలిపారు.