2 July, 2026 | 6:07 PM

పార్ట్ టైం ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకోండి

02-07-2026 05:33 PM

భైంసా (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో విద్యాబోధన కోసం పార్ట్ టైం ఉపాధ్యాయులు , లెక్చరర్లు కోసం ఆరులైన వారు దరఖాస్తు చేసుకోవాలని డి సి ఓ ప్రశాంతి తెలిపారు. అభ్యర్థులు తెలుగు ఇంగ్లీష్ ఫిజిక్స్ కెమిస్ట్రీ జువాలజీ, బయో కెమిస్ట్రీ బాటని   తదితర సబ్జెక్టుల బోధించే ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పిజిటి ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. ఈనెల 4 నుంచి 9వ తేదీ వరకు స్వీకరించి 10న డెమో ఆధారంగా ఎంపిక నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. ఎంపికైన వారు జిల్లాలోని కడెం నచ్చల ఎల్లాపూర్ పోచంపాడు జామ్ ముధోల్ భైంసా గురుకుల పాఠశాలలో పనిచేయవలసి డి ఉంటుందని వివరించారు