2 July, 2026 | 6:15 PM

నాలుగు దశాబ్దాలుగా మెడికల్ ఆఫీసర్ గా పనిచేసిన కోటేశ్వరికి ఘనంగా వీడ్కోలు

02-07-2026 05:41 PM

దమ్మపేట, జూలై 02(విజయక్రాంతి): దమ్మపేట మండల పరిధిలోని పట్వారిగూడెం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా సేవలు అందించిన దమ్మలపాటి కోటేశ్వరి వీడ్కోలు సభ గురువారం సత్తుపల్లి జై కన్వెన్షన్ సెంటర్ నందు ఘనంగా జరిగింది.  పదవి విరమణ సందర్భంగా కోటేశ్వరి దంపతులను వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొయ్యల అచ్యుత్ రావు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొయ్యల అచ్యుతరావు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా ప్రజలకు ఎంతో చేరువలో ఉండి వైద్యం అందిస్తూ తాను పనిచేసిన చోట మచ్చలేని వైద్యురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో చెలికాని భాస్కరరావు, ప్రభాకర్, రమేష్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.