17 April, 2026 | 2:45 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

అతడే ఒక సైనికుడు..

10-06-2025 08:55 PM

కార్యకర్తల కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కష్టపడ్డ శ్రీనుబాబు..

శ్రీను బాబు సేవలను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం..

టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా నియామకం..

అన్నకు తగ్గ తమ్ముడిలా ప్రజలతో మమేకం..

మంథని ప్రజల ఆశీర్వాదాలే తమ కుటుంబానికి శ్రీరామరక్ష..

నిరంతరం ప్రజాసేవలోనే తమ కుటుంబం, తన దైవం అన్న శ్రీధర్ బాబు..

టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు..

మంథని (విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలోనే కాదు... ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తాను ఒక సైనికుడిలా... కార్యకర్తలా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కష్టపడ్డాడు. తన కుటుంబం గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉంటూ తండ్రి దుద్దిళ్ల శ్రీపాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా పనిచేసిన, ఆయన మరణ అనంతరం అన్న శ్రీధర్ బాబు గత 20 సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తూ ప్రభుత్వంలో ముఖ్య పాత్ర పోషిస్తూ రాష్ట్ర ఐటీ మంత్రిగా కొనసాగుతున్న... ఎలాంటి గర్వం, అహంకారం, లేకుండా ఒక సామాన్య కార్యకర్తల, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని పోతూ మహిళలకు అన్నల, తమ్ముడిలా, ఒక కొడుకులా... సామాన్యుడిలా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తూ... మంథని నియోజకవర్గంలో అన్న శ్రీధర్ బాబు గెలుపులో లక్ష్మణునిలా... భాగమై కష్టపడ్డ తమ్ముడే దుద్దిళ్ల శ్రీనుబాబు... శ్రీను బాబు సేవలను స్వయంగా గుర్తించిన జాతీయ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం పట్ల అన్నకు తగ్గ తమ్ముడిగా శ్రీను బాబుకు గుర్తింపు లభించింది. 

పదవులు ముఖ్యం కాదు..

ప్రజాసేవలో మా కుటుంబం పనిచేస్తుంది..

టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు

తమకు పదవులు ముఖ్యం కాదని, ప్రజాసేవలోనే తమ  కుటుంబం పనిచేస్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు(TPCC General Secretary Duddilla Srinu Babu) అన్నారు. తమకు పదవులు కొత్త కాదని, తమ కుటుంబం గత 40 సంవత్సరాలుగా ప్రజాసేవలోనే ఉందని, ఇక కూడా ఉంటుందని, మంథని నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలు తమ కుటుంబానికి శ్రీరామరక్ష అని శ్రీనుబాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ అధిష్టానం గుర్తింపు ఇస్తుందని, పార్టీలో నిరంతరం కష్టపడుతున్న వారికి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని శ్రీనుబాబు తెలిపారు.

మంథని నియోజకవర్గంలో కాకుండా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో కూడా మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందని, అధిష్టానం నాపై పెట్టుకున్న నమ్మకం వమ్ము చేయకుండా తన వంతుగా కష్టపడతానని శ్రీను బాబు తెలిపారు. తన నియమాగానికి కృషి చేసిన కాంగ్రెస్ అధిష్టానానికి మంథని నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు తన దైవం అయిన అన్న శ్రీధర్ బాబుకు శ్రీనుబాబు ధన్యవాదాలు తెలిపారు. శ్రీనుబాబు నియామకంతో మంథని నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.