15 April, 2026 | 1:18 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

పెట్రోల్ బదులు నీళ్లు?

10-06-2025 08:50 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): పెట్రోల్ పంపులో పెట్రోల్ కు బదులు నీళ్లు నింపిన ఘటన మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం పట్టణంలో ఓ పెట్రోల్ పంపులో మంగళవారం జరిగింది. బాధితుడు తోట సాంబయ్య కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తన ద్విచక్రవాహనంలో మంగళవారం ఉదయం పెట్రోల్ పంపులో రెండు లీటర్ల పెట్రోల్ పోయించుకుని దడువాయి పనిచేయడానికి వెళ్లగా మార్కెట్ కు వెళ్లగానే తన బండి ఆగిపోయిందని చెప్పాడు. విధులు ముగించుకుని ఆగిపోయిన తన బండిని మెకానిక్ వద్దకు తీసుకువెళ్లగా మెకానిక్ పరిశీలించి, పెట్రోల్ ట్యాంక్ కిలో నీళ్లు ఉండటంతో ఆగిపోయిందని చెప్పడంతో, ట్యాంక్ లో ఉన్న పెట్రోల్ బయటకు తీయడంతో అందులో నీళ్లు కనిపించాయి.

బాటిళ్లలో నీళ్లు కలిసిన పెట్రోలు ఉదయం పెట్రోల్ పోయించుకున్న పంపు వద్దకు తీసుకువెళ్లి నిర్వాహకుడిని గట్టిగా నిలదీయడంతో వర్షాల వల్ల ట్యాంకు అడుగు భాగంలో నీళ్లు చేరి ఉంటాయని, బండి రిపేరు ఖర్చు చెల్లిస్తానని అంగీకరించాడని తెలిపారు. అయితే ఈ ఘటన జరుగుతున్న సమయంలో పెట్రోల్ పంపులో పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చిన కొందరు ద్విచక్ర వాహనదారులు పెట్రోల్ కు బదులు నీళ్లు వస్తాయి ఏమో అని పెట్రోల్ పోయించుకోకుండా వెను తిరిగారు. పెట్రోల్ పంపు ద్వారా నీళ్లు వచ్చిన ఘటనపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.