2 July, 2026 | 10:51 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

వచ్చే నెలలో అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీ నియామకం

23-07-2024 01:44 AM

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి) : అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీ పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది. వచ్చే నెలలో నూతన కమిటీ నియామకాలను అసెంబ్లీ స్పీకర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పూర్తి చేయనున్నారు. అయితే, ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేని కొంతమంది ప్రజా సంబంధాల వ్యవహారాల విభాగంలోని వ్యక్తులు.. జర్నలిస్టులకు ఫోన్ చేసి మీ మీడియా సంస్థ నుంచి ఒక పేరును సూచించండి అంటూ ఫోన్లు చేయడం చర్చనీయాంశంగా మారిం ది. అయితే, ఈ విషయాన్ని కొందరు మీడియా ప్రతినిధులు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వద్దకు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ఆయన ఆరా తీస్తున్నట్లు సమాచారం.