19 March, 2026 | 1:47 PM

Breaking News

బాలికల గురుకులంలో ఆధునిక వసతి

23-07-2024 01:44 AM
  • విద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత 
  • ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

యాదాద్రి భువనగిరి, జూలై 22(విజయక్రాంతి): చౌటుప్పల్‌లోని బంగారు గడ్డ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజుతో కలిసి గురుకులాన్ని సందర్శించారు. విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. దాదాపు 11 ఎక రాల విస్తీర్ణంలో గల గురుకుల విద్యాసంస్థను రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా తీర్చి దిద్దుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.