ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం
ఆసిఫాబాద్, కాగజ్ నగర్ కు సాలం బిన్ హసన్
కుమ్రం భీం అసిఫాబాద్,(విజయక్రాంతి): బహుజన్ సమాజ్ పార్టీ (Bahujan Samaj Party) ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో పార్టీ వ్యవస్థను బలోపేతం చేయడానికి వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను నియమించింది. ఆదిలాబాద్ జోన్–1 చీఫ్ జోన్ ఇన్‌చార్జ్ అడ్వకేట్ నిశాని రామచంద్రం ప్రకటించారు. నియామకాల ప్రకారం ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆసిఫాబాద్ కు చెందిన సాలం బిన్ హసన్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. బోధ్, బైంసా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌గా కనక ప్రభాకర్‌ను నియమించారు.
ఖానాపూర్, నిర్మల్ నియోజకవర్గాలకు తుడిచిర్ల సంజయ్‌ను బాధ్యతలు అప్పగించారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి పాముల హరినాథ్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు.పార్టీ బలోపేతం, గ్రామ స్థాయిలో కార్యకర్తలను సమీకరించడం, ప్రజా సమస్యలపై పోరాటాలు చేపట్టడం వంటి బాధ్యతలను వీరు నిర్వర్తించనున్నట్లు పార్టీ నాయకత్వం తెలిపింది. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నాయకత్వం వారికి సూచించింది.ఈ సందర్భంగా నియమితులైన నాయకులు పార్టీ ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి బీఎస్పీని బలపరచడానికి కృషి చేస్తామని తెలిపారు.




